అపరిచితుడు అప్పుడు సరిగ్గా మార్నింగ్ 8:00 , సముద్రపు అలలు వయ్యారంగా ఒడ్డుకు చేరుకుంటూ చాల ప్రశాంతంగా ఉంది బీచ్ ,ఆ బీచ్ ఒడ్డునే బీచ్ రిసార్ట్, అక్కడ ఒక రూం లో నుంచి బీచ్ వంక చూస్తుంది "సారిక ", తనకి బీచ్ అంటే చాల ఇష్టం అందుకే పట్టు పట్టి బీచ్ రిసార్ట్ అందునా బీచ్ వ్యూ రూం బుక్ చెయ్యమన్ది తన భర్త ముకుంద్ ని. ముకుంద్ పెద్ద బిజినెస్ మాన్ , గొప్ప వ్యాపారవేత్త , ఇప్పడు కూడా గోవా లో ఒక హోటల్ స్టార్ట్ చేద్దామని, ఇక్కడ కొంతమంది డెలీ గే ట్స్ తో 3 రోజులపాటు మీటింగ్ లో ఉండి కాంట్రాక్టు పూర్తి చేసుకుందామని గోవా కి వస్తాడు. తన వెంట "సారిక " ని కూడా తీసుకువస్తాడు , సారికకి ట్రావెల్ అంటే చాల ఇష్టం ఎప్పుడు భర్త వెంట టూర్ లు తిరుగుతూ ఉంటుంది , సారిక ముకుంద్ రెండవ పెళ్ళాం , మొదటి బార్య చనిపోతే , సారిక ని రెండవ పెళ్లి చేసుకుంటాడు. సారిక తనని చిన్నపటించి వెంటాడుతున్న మిడిల్ క్లాసు ఫ్యామిలి లైఫ్ ని ద్వేషిస...